Breaking News

కేఏ పాల్ పై దాడి

కేఏ పాల్ పై దాడి

  • చెంపచెల్లుమనిపించిన టీఆర్ఎస్​వీ నాయకుడు
  • సిద్దిపేట జిల్లా జక్కాపూర్​లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడికి చేదు అనుభవం

సామాజిక సారథి, సిద్దిపేట: రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై టీఆర్ఎస్​ నాయకుడు దాడి చేశాడు. ఈ ఘటన సోమవారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఇటీవల వడగండ్ల వానకు నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు సిరిసిల్ల వెళ్తున్న కేఏ పాల్ ను సిద్దిపేట జిల్లా జక్కాపూర్ లో టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. కారుకు అడ్డంగా పడుకుని నిరసన వ్యక్తం చేశారు. దీంతో కేఏ పాల్​కారు నుంచి కిందికి దిగి మాట్లాడుతుండగా తంగళ్లపల్లి మండలం చెల్లెళ్లకు చెందిన అనిల్ రెడ్డి అనే వ్యక్తి ఒక్కసారిగా దాడికి తెగబడ్డాడు. కేఏ పాల్​ చెంప చెల్లు మనిపించాడు. దీంతో పక్కనే ఉన్న కేఏ పాల్ కోడలు జ్యోతి టీఆర్ఎస్ కార్యకర్తలను అడ్డుకున్నది. ఈ క్రమంలో అనిల్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడు టీఆర్ఎస్ యూత్ నాయకుడిగా, నేరెళ్ల సింగిల్ విండో డైరెక్టర్ గా ఉన్నాడు.

కేఏ పాల్​పై దాడి జరుగుతుండగా వారిస్తున్న అతని అనుచరులు, పోలీసులు