Breaking News

మెడికల్ ​కాలేజీ భూములపై రాజకీయాలు

మెడికల్​కాలేజీ భూములపై రాజకీయాలు

సామాజికసారథి, నాగర్​కర్నూల్ ​ప్రతినిధి: రాజకీయ లబ్ధి కోసమే అసత్య ప్రచారాలు చేస్తున్న బీఎస్పీ, బీజేపీ, కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ జనసమితి నాయకులు మెడికల్ కాలేజీ విషయంలో మాట్లాడం సిగ్గుచేటని తెలంగాణ మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి అభిమాన్య, తెలంగాణ మాలమహానాడు నాయకులు ఎద్దుల వెంకటేశ్, కొమ్ము మోహన్, వీరేశం, శ్రీనివాస్, రామకృష్ణ, బీసీ సంక్షేమ సంఘం నాయకులు బాలరాజు, మైనారిటీ నాయకులు రహీం, ఎస్టీ నాయకులు ఆశన్న అన్నారు. శుక్రవారం వారు మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి సీఎం కేసీఆర్​తో కోట్లాడి తన జిల్లా ప్రజలందరికీ వైద్య సేవలు జిల్లా కేంద్రంలో అందుబాటులో ఉండేలా మెడికల్ కాలేజీని ఏర్పాటుచేశారని తెలిపారు. అఖిలపక్షం పేరిట కులం పేరు తో రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వాలు ఇచ్చిన అసైన్డ్ భూములను ప్రజల అవసరాల కోసం నష్టపరిహారం చెల్లించి తీసుకున్నారని తెలిపారు. పుట్టపాగ మహేంద్రనాథ్ వారసులుగా స్వచ్ఛందంగా అభివృద్ధి కోసమే భూములను దానం చేశారని తెలిపారు.