Breaking News

యూట్యూబ్​ను షేక్​చేస్తున్న ‘‘నెమలి కన్నుల దానివే ఓ పిల్లా’’ సాంగ్​

యూట్యూబ్​ను షేక్​చేస్తున్న ‘‘నెమలి కన్నుల దానివే ఓ పిల్లా’’ సాంగ్​

సామాజికసారథి, ఫీచర్స్​ ​డెస్క్: జానపద సాహిత్యం జీవితమంత విశాలమైనది. వెస్ట్రన్, పాప్ ​మ్యూజిక్ ​సంగీత ప్రపంచాన్ని ముంచెత్తుతున్న తరుణంలో కమ్మనైన బాణీలతో పల్లె పదానికి కొత్త సొబగులు అద్దుతున్నారు ఈ గాయకులు. ఆ పాటలు వింటుంటే గుండెకు హత్తుకుంటుంది. ఒక్కసారిగా పల్లె స్మృతులు, బావమరదళ్ల సరసాలు, పిచ్చుకగూళ్లు, సెలయేర్లు, కొబ్బరి తోటలు.. ఇవన్నీ గుర్తుకొస్తుంటాయి. అలాంటి జ్ఞాపకాలను మోసుకొచ్చే ఓ సాంగ్ ఇప్పుడు యూ ట్యూబ్ ను షేక్ ​చేస్తోంది. DJSHIVA music ఛానెల్ ​రూపొందించిన ‘‘ నెమలి కన్నుల దానివే ఓ పిల్లా నెలవంక తీరున్నావే ఈ వేళ..!, సెలయేరు పారుతుంటే ఓ పిల్లా ఎదగోళ్లు ఉండే లోలోన.. నదులన్నీ కలిసినట్టు నవ్వెంతో బాగున్నది ఈ వేళ’’ అంటూ సాగే ఈ యుగళగీతం అలసిపోయిన మనస్సులను పరవశింపజేస్తున్నది. సరళమైన భాష, శ్రావ్యమైన సంగీతం, వినసొంపైన బాణీలు, అంతకంటే ఆహ్లాదమైన ప్రకృతి రమణీయతతో పులకరింపజేస్తోంది. మహేందర్ ​ముల్కాల రాశారు. కళ్యాణ్​ సంగీతం సమకూర్చగా, డీకే శివ వంగూరు, శ్రీనిధి శ్రావ్యమైన గొంతుతో ఆలపించారు. ఇప్పటికే 17,025,278 మంది విన్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరూ వినేయండి.. హాయిగా..!