Breaking News

మంత్రి బ్యాటింగ్.. ఎమ్మెల్యే బౌలింగ్

మంత్రి బ్యాటింగ్.. ఎమ్మెల్యే బౌలింగ్

సారథి న్యూస్, హుస్నాబాద్: యువతకు క్రీడలు చాలా అవసరమని, గ్రామీణ ఆటలు బాగా ఆడించాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి టి.హరీశ్ రావు పిలుపునిచ్చారు. మండల కేంద్రమైన కోహెడలో సీఎం కేసీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని టీఆర్ఎస్​వీ ఆధ్వర్యంలో హుస్నాబాద్ నియోజకవర్గస్థాయి క్రికెట్ టోర్నమెంట్ క్రీడలను మంత్రి హరీశ్ రావు బుధవారం వీక్షించారు. ఈ మేరకు హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్ కుమార్​ బౌలింగ్ చేయగా, మంత్రి బ్యాటింగ్ చేస్తూ.. వినూత్నరీతిలో షాట్లు కొట్టి అక్కడి వారందరినీ అలరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఆహారపు అలవాట్లు మారడంతో కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయని, మనిషికి ఫిజికల్ ఫిట్ నెస్ అవసరమని.. క్రానికల్, నాన్ క్రానికల్ వ్యాధుల గురించి అవగాహన కల్పించారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలిపిన ఏకైక వ్యక్తి సీఎం కేసీఆర్ అని చెప్పారు. త్వరలోనే హుస్నాబాద్ కు స్టేడియం కోసం నిధులు కేటాయిస్తానని హామీనిచ్చారు. అంతకు ముందు డిగ్రీ, ఇంటర్ విద్యార్థులకు సొంత డబ్బులతో కడుపునిండా అన్నం పెట్టి కన్న బిడ్డల్లా చూసుకున్నారని ఎమ్మెల్యే సతీశ్ కుమార్​ను కొనియాడారు.