Breaking News

జర్నలిస్టులను కించపరిచే చర్యలను సహించేది లేదు

√ నకిలీడాక్టర్ల ముసుగులో ప్రజలను,కౌన్సిలర్ ముసుగులో ప్రభుత్వ భూములను కబ్జాచేస్తూ జర్నలిస్టుల పై ఆరోపణలా..?

√ జర్నలిస్టులపై విషం చిమ్మితే ఖబర్దార్.

సామాజిక సారథి , నాగర్ కర్నూల్ : జర్నలిస్టులను కించపరిచే విధంగా ఎవరు వ్యవహరించిన ఉపేక్షించేది లేదని నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని జర్నలిస్టు లు హెచ్చరించారు. గత రెండు రోజులుగా ఓ నకిలీ డాక్టర్ మరో మున్సిపల్ కౌన్సిలర్ తో కలిసి తమ అక్రమాలను బయటపెడుతున్నారన్న అక్కసుతో నిజాయితీగా వార్తలు రాస్తున్న జర్నలిస్టులను అభాసుపాలు చేయాలన్న దుర్బుద్ధితో పోస్టింగ్ లు పెడుతూ కించపరిస్తే ఎంత మాత్రం సహించబోమని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు మరియు ఫోటో వీడియో జర్నలిస్టులు, కేబుల్ టీవీ ఛానల్ జర్నలిస్టులు, యూట్యూబ్, జర్నలిస్టులు ముక్తకంఠంతో ఇలాంటి చర్యలను ఖండించారు. సీనియర్ జర్నలిస్ట్ ఆసుపత్రికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ ను వారి పత్రిక వార్షికోత్సవం సందర్భంగా సంబంధిత ఆసుపత్రి నిర్వహకులను సంప్రదించగా… ఆసుపత్రి భవనాన్ని లీజుకు ఇచ్చిన ఓ ఆర్ ఎం పి తనకు సంబంధం లేకపోయినా కించపరిచే చర్యలకు పాల్పడడమే కాకుండా… లీజుకు ఇచ్చిన ఆస్పత్రి భవనంలోనే ఓ యూట్యూబర్ ద్వారా తప్పుడు వార్తలను ప్రచురించే విధంగా యూట్యూబ్ జర్నలిస్టును తప్పు దోవ పట్టించి తప్పుడు వార్తలను సోషల్ మీడియాలో వైరల్ చేసిన విధానాన్ని తీవ్రస్థాయిలో తప్పుపట్టారు. సదరు ఆర్ఎంపి నీ రియల్ ఎస్టేట్ వ్యాపారిగా కౌన్సిలర్ గా చలామణి అవుతూ కబ్జాలకు పాల్పడి ప్రభుత్వ భూములను సైతం కబ్జా చేసి అమ్మిన చరిత్ర కలిగిన వ్యక్తులు నిబద్ధతతో పనిచేస్తున్న జర్నలిస్టులను సమాజంలో తక్కువ చేసి చూపాలన్న దుర్బుద్ధితో చేసిన చర్యగా వారు అభివర్ణించారు. ఇలాంటి భూకబ్జాదారులు దొంగ డాక్టర్ల చర్యలకు భయపడేది లేదని భవిష్యత్తులో గతంలో పనిచేసిన విధంగానే నిబద్ధత తో పని చేసి ప్రభుత్వ భూములను కాపాడుతూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారి పట్ల కఠినంగానే ఉంటామని ముక్తకంఠంతో జర్నలిస్టులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా యూనియన్లకు అతీతంగా జర్నలిస్టులంతా సీఐ విష్ణు వర్ధన్ రెడ్డి గారిని కలిసి సంఘటనను వివరించి.. లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది. తప్పుడు వార్తలు ప్రసారం చేసిన వారిని, చేయించిన వారిపై సోషల్ మీడియాలో జర్నలిస్టులకు వ్యతిరేకంగా పోస్టింగ్లను ఫార్వర్డ్ చేసిన వారి పట్ల చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సిఐ గారిని కోరడం జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు అహ్మదుల్లా ఖాన్, చంద్రశేఖర రావులు మీడియాతో మాట్లాడుతూ వారి చర్యలను తీవ్రస్థాయిలో ఖండించారు. జర్నలిస్టులను కించపరిచే వారిపట్ల అప్రమత్తంగా ఉంటూ కలిసికట్టుగా వారిని ఎదుర్కోవడానికి కలిసి వస్తామని అందరూ జర్నలిస్టులు పేర్కొన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే భవిష్యత్తులో ప్రత్యక్ష కార్యాచరణను ప్రకటించి ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు, కేబుల్ టీవీ ఛానల్స్ జర్నలిస్టులు,యూట్యూబ్ జర్నలిస్టులు, ఫోటో వీడియో జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.