Breaking News

భయపడొద్దు..నిర్భయంగా చెప్పండి

భయపడొద్దు..నిర్భయంగా చెప్పండి

సారథి, సిద్దిపేట ప్రతినిధి: కొవిడ్ సింటమ్స్ ఉంటే భయపడకుండా నిర్భయంగా తమకు చెప్పుకోవాలని హుస్నాబాద్ మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ అయిలేని అనితశ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుటుంబంలో ఎవ్వరికైనా జ్వరం, తలనొప్పి, దగ్గు, జలుబు, ఒంటినొప్పులు ఉంటే వెంటనే ప్రభుత్వాస్పత్రిల్లో కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలన్నారు. వ్యాధి తీవ్రతరం కాకముందే తమకు చెప్పుకుంటే సరైన వైద్యం అందించడం ద్వారా కుటుంబ సభ్యులతో పాటు సమాజ హితంగా ఉంటుందన్నారు. కొవిడ్ నిబంధనలకు ప్రకారం అత్యవసరమైతేనే మాస్కు ధరించి బయటకు రావాలన్నారు. మున్సిపాలిటిలోని బుధవారం 5, 16 వార్డుల్లో నిర్వహించిన ఫీవర్ సర్వేలో వార్డు ప్రజలకు తగు జాగ్రత్తలు చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుంకే రాజమల్లయ్య, 5వ వార్డు కౌన్సిలర్ పేరుక భాగ్యరెడ్డి, 16వ వార్డు కౌన్సిలర్ జనగామ రత్నమాల, ఆర్పీ శోభ, అంగన్వాడీ టీచర్లు భాగ్య, కాంత, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.