Breaking News

సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలపై బిఆర్ఎస్ ఎంపి కాండిడేట్ పై బిజెపి ఫిర్యాదు

  • గెలవలేక దొంగ దారులు వెతుక్కుంటున్నారు అన్న భరత్ ప్రసాద్
  • బిఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం పై జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు

సామాజిక సారధి , నాగర్ కర్నూల్ బ్యూరో: ఎన్నికల ప్రచారం నిన్నటితో ముగియడంతో అభ్యర్థులు పోల్ మేనేజ్మెంట్ పై దృష్టి సారిస్తుండగా భారత రాష్ట్ర సమితి ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరియు అతని సోషల్ మీడియా విభాగం భారతీయ జనతా పార్టీ పైన సోషల్ మీడియా వేదికగా విష ప్రచారం ప్రారంభించడంతో దీనిపై భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ జిల్లా ఎస్పీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ కు ఫిర్యాదు చేశారు. తాజాగా ఆదివారం రోజు ఎన్నికల సమీపిస్తున్న వేళ భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియా నాగర్ కర్నూల్ పార్లమెంట్ విభాగం ఇంచార్జ్ రంగినేని అభి లా ష్ రావు అతని బృందం సోషల్ మీడియా వేదికగా పోతుగంటి భరత్ ప్రసాద్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవికి అమ్ముడుపోయారని అందుకే ప్రచారం సరిగా చేయడం లేదని 250 కోట్లకు పైగా ఆస్తులు రాయించుకుని ప్రచారం నిర్వహించడం లేదు అంటూ సోషల్ మీడియా విభాగాలలో వైరల్ చేశారు. దీనిపై వెంటనే స్పందించిన బిజెపి అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ ఆ మెసేజ్ ను సోషల్ మీడియా వేదికగా ప్రచారం నిర్వహిస్తున్న కొందరిపై చర్యలు తీసుకోవాలంటే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాష్ట్ర సమితికి ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా మూడవ స్థానం ఖరారు కావడంతో కనీసం డిపాజిట్లు అయినా దక్కించుకునేందుకు సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారని ఇది ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని దీనిపై వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ ఎవరు ఎన్ని పైసలు దండుకున్నారో అందరికీ తెలుసని దీనిని రాష్ట్ర ప్రజలు నాగర్కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గం ప్రజలు కచ్చితంగా గమనిస్తున్నారని ఓటుతో ఆ విష ప్రచారం చేసిన అభ్యర్థులకు తగిన రీతిలో బుద్ధి చెప్తారని ఆయన హెచ్చరించారు.