Breaking News

ప్రాణం పోయినా అంబులెన్స్ స్పందించలె..

ప్రాణం పోయినా అంబులెన్స్ స్పందించలె..

సారథి ప్రతినిధి, సిద్దిపేట: ఓ మహిళను ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రాణాలను కాపాడాలని వేడుకున్నా అంబులెన్స్ సకాలంలో స్పందించలేదు. సిద్దిపేట జిల్లా కొహెడ మండల కేంద్రానికి చెందని వేల్పుల బాలవ్వ సోమవారం తన ఇంటి ఆవరణలోని నీళ్ల ట్యాంక్ మూతపై ప్రమాదవశాత్తు కాలుజారి పడిపోయింది. ఉదయం 7 గంటల సమయంలో 108 అంబులెన్స్ కు సమాచారం ఇవ్వగా, ఓ గంట తర్వాత అంబులెన్స్ వస్తుందని సిబ్బంది చెప్పారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే బాలవ్వ మృతిచెందింది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకొచ్చారు. కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రైవేట్ వాహన దారులు ఇతర ప్రాంతాలకు రావాలంటే బయపడుతుండడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ఆంక్షలున్నాయని చెప్పుతున్నారన్నారు. ఇప్పటికైనా మంత్రి, ఎమ్మెల్యే స్పందించి పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వం వైద్యం అందించేందుకు కొహెడ మండలానికి 108 అంబులెన్స్ కేటాయించారని మాదిగ జేఏసీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు వేల్పుల శంకర్ మండల ప్రజల పక్షాన కోరారు.