Breaking News

స్పీడ్ చెస్ ఆడాలనే..

స్పీడ్ చెస్ ఆడాలనే..:

చెన్నై: గతంలో సమయ నియంత్రణలో ఎప్పుడూ చెస్ ఆడలేదని, అందుకే ఈసారి ఫిడే మహిళల ఆన్​లైన్​స్పీడ్ చెస్ టోర్నీలో బరిలోకి దిగుతున్నానని భారత గ్రాండ్​మాస్టర్ కోనేరు హంపి చెప్పింది. దీనివల్ల ప్లేయర్ల వేగం ఎంతో తెలుస్తుందని పేర్కొంది. గ్రాండ్​మాస్టర్లు ద్రోణవల్లి హారిక, వైశాలి, ప్రపంచ చాంపియన్ జు వెనుజు లాంటి మేటి ప్లేయర్లు ఇందులో పాల్గొననుండటంతో టోర్నీ ఆసక్తికరంగా సాగుతుందని చెప్పింది. స్పీడ్ చెస్​లో ఎత్తు వేయడానికి ఒక నిమిషం లభిస్తుంది. ఒక్కో ఎత్తు తర్వాత ఒక్కో సెకన్ అదనంగా లభిస్తుంది.

‘సమయ నియంత్రణ పద్ధతిలో ఎప్పుడూ ఆడలేదు. ఈసారి బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నా. ప్రపంచంలోని అత్యుత్తమ క్రీడాకారులు పాల్గొంటుండటంతో టోర్నీ ఆసక్తికరంగా సాగడం ఖాయం. కార్ల్​సన్ సహా టాప్ ప్లేయర్లు ఆన్​లైన్​ టోర్నీల్లో ఆడడం మంచి పరిణామం. వాళ్లు గతంలో కంటే ఇప్పుడే ఎక్కువ చెస్ ఆడుతున్నట్లున్నారు’ అని హంపి వ్యాఖ్యానించింది.