Breaking News

సెలూన్లు ఓపెన్​

ముంబై : మహారాష్ట్రలో సెలూన్లు ఓపెన్​ చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకున్నది. క‌రోనా కార‌ణంగా మూడు నెల‌ల నుంచి సెలూన్లను మూసివేశారు. దీంతో సెలూన్​ నిర్వాహకులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పటికే 12 మంది బార్బర్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో జూన్ 28 నుంచి రాష్ట్రవ్యాప్తంగా క్షౌరశాలలు తెరిచేందుకు ముఖ్య‌మంత్రి ఉద్ద‌వ్ ఠాక్రే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. గురువారం జ‌రిగిన స‌మీక్ష‌లో కేబినెట్ దీనికి ఆమోద‌ముద్ర తెలిపిందని మంత్రి విజయ్ తివార్ తెలిపారు. లాక్‌డౌన్ కార‌ణంగా ఆదాయం లేక తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నామ‌ని వెంట‌నే దుకాణాలు తెరిచేందుకు అనుమ‌తించాల‌ని, లేని ప‌క్షంలో ఆర్థిక ప్యాకేజీ అయినా ప్ర‌క‌టించాల‌ని కొంతకాలంగా బార్బర్​ దుకాణాల నిర్వాహకులు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో ప్ర‌భుత్వం తాజా నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. సెలూన్లలో శానిటైజ‌ర్ల వాడ‌కం లాంటి వ్య‌క్తిగ‌త శుభ్ర‌తా ప్ర‌మాణాలు పాటించాల‌ని మంత్రి విజ‌య్ ఆదేశించారు.