Breaking News

సీనియర్​ నటి జయంతికి తీవ్ర అస్వస్థత

సీనియ‌ర్ న‌టి జ‌యంతి ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం ఆమె బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ఆమె శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది పడుతూ ఆస్పత్రిలో చేరినట్టు ఆమె కుమారుడు తెలిపారు. ప్రస్తుతం జయంతికి వెంటిలేటర్​పై చికిత్స నందిస్తున్నారు. ఆమెకు కరోనా టెస్టులు నిర్వ‌హించ‌గా, నెగిటివ్ గా తేలిన‌ట్టుగా తెలిపారు. ఆమె చాలాకాలంగా ఆస్తమాతో బాధ‌ప‌డుతున్న‌ట్టుగా స‌మాచారం. తెలుగు, క‌న్న‌డ‌, తమిళ, మరాఠి భాషల్లోని పలు చిత్రాల్లో జయంతి న‌టించారు. 1960‌లో ఆమె న‌టిగా కెరీర్ ఆరంభించారు. హీరోయిన్ గా అనేక సినిమాల్లో నటించ‌గా, క్యారెక్టర్​ ఆర్టిస్టుగా కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. అన్ని భాషల్లో క‌లిపి 500ల‌కు పైగా సినిమాల్లో న‌టించారు.