Breaking News

సింపుల్​గా పెళ్లి చేసుకోవాలని..

సౌత్ లో స్టార్ హీరోయిన్ అయిన నయనతార కెరీర్ స్టార్టింగ్ నుంచీ ఏదో ఒక విమర్శను ఎదుర్కొంటూనే ఉంది. సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనదని, గ్రాండ్ ఫంక్షన్స్​కు అటెండ్ కాదని.. అవార్డు వేడుకల్లో మాత్రం పాల్గొనాలి కనక వస్తుందనే రూమర్లు నమన్​పై చాలానే ఉన్నాయి. నిజంగానే నయన్ కూడా రజినీకాంత్.. చిరంజీవి.. విజయ్ ఇంకా పెద్ద స్టార్స్ సినిమాల ప్రమోషన్స్ ను కూడా ఎగ్గొట్టేది. అలాగే ఇప్పుడు నయనతార తన పెళ్లి వేడుకకు కూడా ఆసక్తి చూపడం లేదట.
తమిళ మీడియాలో రెండు మూడు రోజులుగా నయనతార విఘ్నేష్ శివన్ ల వివాహం గురించి వార్తలు వస్తున్నాయి. అతిత్వరలోనే వీరిద్దరి వివాహం జరుగబోతుందని సమాచారం. నాలుగేళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారట. వీరి ప్రేమ వ్యవహారం గురించి మీడియాలో రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. దాంతో పుకార్లన్నింటికీ చెక్ పెట్టేందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. స్టార్స్ లవ్ మ్యారేజ్ అంటే అదిరిపోయే రేంజ్ లో ఏర్పాట్లు ఉంటాయి. కానీ నయనతార మాత్రం వేడుక ఇష్టం లేదని సింపుల్ గా తన పెళ్లి కానిచ్చేయాలని చూస్తోందట. సినిమాల ఆడియో వేడుకలకు హాజరయ్యేందుకు ఇబ్బంది పడ్డట్టే అందరి ముందు పెళ్లి చేసుకునేందుకు కూడా నయన్ ఇబ్బంది పడుతుండొచ్చన్న డౌట్ కామెంట్లు నెట్టింట కనిపిస్తున్నాయి. కారణం ఏదైనా కానీ.. హిందూ సంప్రదాయం ప్రకారం మొదట ఒక గుడిలో నయన్ వివాహం జరగబోతుంది. ఆ తర్వాత చర్చిలో అతితక్కువ మంది బంధుమిత్రుల సమక్షంలో వివాహానికి ఏర్పాట్లు జరుగుతున్నాయట. నయన్ పెళ్లి వేడుక కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది చాలా పెద్ద నిరాశే మరి..!