Breaking News

శర్వాన్​తో జోడీ

శర్వాన్​తో జోడి


‘ఊహలు గుసగుసలాడే’తో తెలుగు తెరకు పరిచయమైంది రాశీఖన్నా. వరుస సినిమాలతో మంచి జోరులో ఉంది. ఈ ఏడాది రిలీజైన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రం ఆశించిన ఫలితాన్నివ్వకపోయినా చైతూతో చేసిన ‘వెంకీమామ’, సాయి తేజతో జోడికట్టిన ‘ప్రతి రోజు పండగే’ సినిమాలు రాశీకి మంచి పేరు తెచ్చాయి. తాజాగా శర్వా పక్కన నటించేందుకు ఒప్పుకుందట. ‘ఆర్ఎక్స్100’తో హిట్ కొట్టిన అజయ్ భూపతి మల్టీస్టారర్​ గా తెరకెక్కించనున్న సినిమా ‘మహాసముద్రం’లో శర్వానంద్ కు జోడీగా నటించనుందట. ప్రస్తుతం రెండు తమిళ సినిమాలకి కమిటైన రాశి ఈ ఏడాది తెలుగులో నటించబోయే సినిమా ఇది ఒక్కటేనేమో అంటున్నారు. అనిల్ సుంకర ఏకే ఎంటర్ టెయిన్ మెంట్స్ బ్యానర్పై నిర్మించనున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాల త్వరలోనే తెలియనున్నాయి.