Breaking News

‘వినాయకుడు’ రీమేక్​

వినాయకుడు తెలుగుమూవి

తెలుగులో విజయం సాధించిన ‘వినాయకుడు’ చిత్రాన్ని బాలీవుడ్​లో రీమేక్​ చేయనున్నట్టు సమాచారం. కొంతకాలంగా తెలుగులో సూపర్ హిట్ అయిన చిత్రాలను బాలీవుడ్​లో రీమేక్ చేసేందుకు అక్కడి దర్శకనిర్మాతలు పోటీపడుతున్నారు. ఇప్పటికే పలు సినిమాలు బాలీవుడ్ రీమేక్ కు రెడీ అయ్యాయి. చాలా కాలం క్రితం తెలుగులో హిట్​ అయిన దూకుడు, అరుంధతి వంటి సినిమాలను ప్రస్తుతం రీమేక్​ చేస్తున్నారు బాలీవుడ్​ నిర్మాతలు. కాగా దాదాపు 12 ఏళ్ల క్రితం కృష్ణుడు హీరోగా నటించిన ‘వినాయకుడు’ సినిమాను హిందీ లో తీయాలని చూస్తున్నారట. వినాయకుడు చిత్రంలో సోనియా హీరోయిన్​గా నటించింది. సాయి కిరణ్ అడవి దర్శకత్వంలో వచ్చిన వినాయకుడు ప్రేక్షకులను నవ్వించడంతో పాటు ఎమోషనల్ గా కూడా ఆకట్టుకుంది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మించనుండగా తెలుగు లో దర్శకత్వం వహించిన సాయి కిరణ్ అడవి హిందీలో కూడా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తుంది. ‘వినాయకుడు’ టైటిల్​ పట్ల అప్పట్లో కొన్ని హిందూ సంస్థలు అభ్యంతరం తెలిపాయి.