Breaking News

వర్షాలకు వెయ్యి కోళ్లు మృత్యువాత

వర్షాలకు వెయ్యి కోళ్లు మృత్యువాత

సారథి న్యూస్, రామాయంపేట: కరోనా నేపథ్యంలో.. ఉన్న ఊరులోనే తన శక్తి మేర పెట్టుబడి పెట్టి ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఆశపడ్డ ఓ యువకుడి ఆశలు అడియాసలయ్యాయి. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు కోళ్ల షెడ్ లోకి చేరడంతో సుమారు వెయ్యి కోళ్లు మృత్యువాతపడ్డాయి. ఈ ఘటన మండలంలోని మెదక్​ జిల్లా రామాయంపేట చల్మెడ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ సందర్భంగా షెడ్ నిర్వాహకుడు కరుణాకర్ మాట్లాడుతూ.. కరోనా కారణంగా ఎక్కడికి వెళ్లి ఉద్యోగం చేసుకుని పరిస్థితులు నెలకొనడంతో నాటుకోళ్ల పెంపకం చేపట్టి ఆదాయం సంపాదించాలని అనుకుంటే వర్షాలు ఆశలపై నీళ్లు చల్లాయని ఆవేదన వ్యక్తం చేశారు. కోళ్ల ఫారం షెడ్డును వీఆర్వో వనజ పరిశీలించి రిపోర్టు రెడీ చేసి ఉన్నతాధికారులకు పంపిస్తామని తెలిపారు.