Breaking News

మొగులయ్య.. బాగున్నావయ్యా!

మొగులయ్య.. బాగున్నావయ్యా!

సామాజికసారథి, వెల్దండ: పద్మశ్రీ అవార్డు గ్రహీత, అరుదైన 12 మెట్ల కిన్నెర వాయిద్య కళాకారుడు దర్శనం మొగులయ్యను సోమవారం నాగర్​కర్నూల్​ జిల్లా వెల్దండ ఎస్సై ఎం.నర్సింహులు ఘనంగా సత్కరించారు. ఆయన బాగోగులను అడిగి తెలుసుకున్నారు. రెండు రోజుల క్రితం న్యూఢిల్లీలో మాజీ రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ వీడ్కోలు కార్యక్రమానికి హాజరయ్యారు. హైదరాబాద్​ నుంచి స్వగ్రామం లింగాల మండలం అవుసలికుంటకు వెళ్తున్న ఆయన సోమవారం వెల్దండలో కొద్దిసేపు ఆగారు. మొగులయ్యను వెల్దండ సర్పంచ్​ యెన్నం భూపతిరెడ్డి కలిసి సత్కరించారు. అలాగే జర్నలిస్టులు మట్టా కరుణాకర్​ గౌడ్​, ఎం.మల్లేష్​, శ్రీనివాసులు తదితరులు కలిసి సన్మానించారు. కాగా, ఇటీవల పవర్​స్టార్​ పవన్​ కళ్యాణ్ ​నటించిన ‘భీమ్లానాయక్’ సినిమాలో ‘ శభాష్​ భీమలానాయక…’ పాటతో దర్శనం మొగులయ్య పేరు విశ్వవ్యాప్తమైంది. గొప్ప కళాకారుడైనా సాదాసీదా జీవనం గడుపుతుంటారు. తన అరుదైన 12 మెట్ల కిన్నెర వాయిద్య కళను బతికిస్తున్న దర్శనం మొగులయ్యకు కేంద్రప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. రాష్ట్రప్రభుత్వం రూ.కోటి నజరానా ఇవ్వడంతో పాటు హైదరాబాద్ లో ఇల్లు కేటాయించింది

మొగులయ్యను అభినందిస్తున్న వెల్దండ సర్పంచ్​ యెన్నం భూపతిరెడ్డి

పద్మశ్రీ దర్శనం మొగులయ్యతో వెల్దండ జర్నలిస్టులు