Breaking News

మెస్సీ @ 700

మెస్సీ @ 700

మాడ్రిడ్: కీలక సమయంలో కళ్లు తిరిగే పెనాల్టీ కార్నర్​తో గోల్ సాధించినా.. ప్రత్యర్థి ఆటగాళ్లను అడ్డుకోలేకపోయిన ఎఫ్సీ బార్సిలోనా.. లా లిగా టోర్నీలో మూడో డ్రాతో సంతృప్తి పడింది. దీంతో అట్లెటికో మాడ్రిడ్​తో జరిగిన ఫుట్​బాల్​ లీగ్ మ్యాచ్​ను 2–2తో డ్రాగా ముగించింది. బార్సిలోనా తరఫున డియాగో కోస్టా(11వ ని.), లియోనల్ మెస్సీ(50వ ని.) గోల్స్ చేయగా, సాల్ నిగుయెజ్ (19, 62వ ని.) అట్టెటికోకు గోల్స్ అందించాడు. ప్రస్తుతం రియల్ మాడ్రిడ్ 32 మ్యాచ్​ల్లో 71 పాయింట్లతో టాప్​లో కొనసాగుతుండగా, ఎఫ్సీ బార్సిలోనా 33 మ్యాచ్​ల్లో 70 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.

అట్లెటికో మాడ్రిడ్ 33 మ్యాచ్​లో 59 పాయింట్లతో మూడో స్థానాన్ని దక్కించుకుంది. సెవిల్లా ఎఫ్సీ (57), గెలాఫీ (52) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. లీగ్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్​లో మూడో డ్రా చేసుకున్న బార్సిలోనా, ఒకే ఒక్క మ్యాచ్​లో నెగ్గింది. తొలి క్వార్టర్​ 11వ నిమిషంలో మెస్సీ కొట్టిన కార్నర్ కిక్కు సూపర్ ఫినిష్ ఇచ్చిన కోస్టా ఓన్ గోల్ సాధించాడు. దీంతో బార్సిలోనా 1–0 ఆధిక్యంలోకి వెళ్లింది. సరిగ్గా ఎనిమిది నిమిషాల తర్వాత సాల్ నిగుయెజ్ కొట్టిన పెనాల్టీ కార్నర్ బార్సిలోనా గోల్ పోస్ట్​లోకి దూసుకుపోవడంతో ఇరుజట్ల స్కోరు సమమైంది. మ్యాచ్ 50వ నిమిషంలో రెనాన్ లోడి అందించిన పాస్​ను డ్రిబ్లింగ్ చేసిన మెస్సీ కర్లింగ్ కిక్ కొట్టడంతో బాల్ నేరుగా అట్లెటికో గోల్ పోస్ట్​ను ఛేదించింది. మెస్సీ కెరీర్​లో ఇది 700వ గోల్ కావడం విశేషం. సాల్ నిగుయెజ్ కొట్టిన కార్నర్ కిక్.. బార్సిలోనా ప్లేయర్ టెర్ స్టాజెన్ చేతితో అడ్డుకోవడంతో అట్లెటికోకు రెండో పెనాల్టీ కార్నర్ లభించింది. ఈ అవకాశాన్ని సాల్ నిగుయెజ్ గోల్​గా మలిచి స్కోరు మరోసారి సమం చేశాడు.
700 క్లబ్​లో మెస్సీ
అర్జెంటీనా స్టార్ స్ట్రయికర్, బార్సిలోనా టాప్ ప్లేయర్ మెస్సీ 700 గోల్స్ క్లబ్​లో చోటు సంపాదించాడు. దీంతో ఈ ఘనత సాధించిన రెండో ఫుట్​బాలర్​గా రికార్డుల్లోకి ఎక్కాడు. క్లబ్ ఫుట్​బాల్​లో 630 గోల్స్ చేసిన మెస్సీ.. అర్జెంటీనా తరఫున అంతర్జాతీయ స్థాయిలో 70 గోల్స్ సాధించాడు. 856 మ్యాచ్​ల్లో మెస్సీ ఈ ఫీట్​ను సాధించాడు. జువెంటాస్, పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో(725) టాప్​లో ఉన్నాడు. ఓవరాల్​గా వెయ్యి మ్యాచ్​లు ఆడిన రొనాల్డో క్లబ్ స్థాయిలో 626 గోల్స్ సాధించాడు.