Breaking News

మలయాళ రీమేక్​లో విశ్వక్

మలయాళ రీమేక్​లో విశ్వక్

రీసెంట్​గా ‘హిట్’ సినిమాతో హిట్ కొట్టిన విశ్వక్ సేన్ ఓ మలయాళ రీమేక్ చిత్రం చేయనున్నాడట. ‘ఫలక్​నుమా దాస్’తో హైప్ నందుకున్న విశ్వక్ డిఫరెంట్ కాన్సెప్ట్​లను ఎంచుకోవడంలో ముందుంటాడు. ప్రస్తుతం ‘హిట్’ సీక్వెల్, పాగల్ సినిమాలకు కమిటై ఉన్నాడు విశ్వక్. అయితే ఇప్పుడు ఈ మలయాళ రీమేక్​లో నటించనున్నాడని టాలీవుడ్ టాక్. ‘అయ్యప్పన్ కోషియమ్’ను రీమేక్ చేయనున్న సంస్థ సితార ఎంటర్ టెయిన్ మెంట్స్ ఈ ఏడాది రిలీజై అక్కడ హిట్ కొట్టిన మలయాళ మూవీ ‘కప్పేలా’ సినిమా రైట్స్​ను సొంతం చేసుకుందట. ఈ సినిమాలో ఒక హీరో పాత్రకు విశ్వక్​ను సంప్రదించగా ఓకే చెప్పాడట. ‘సెల్ ఫోన్ లో రాంగ్ నంబర్ వల్ల ఒక పల్లెటూరి అమ్మాయికి ఒక ఆటో డ్రైవర్​తో పరిచయం ఏర్పడుతుందట. దానివల్ల ఆమె ఎలాంటి ఇబ్బందులకు గురైంది’ అనేదే చిత్రాంశం. చిన్న సినిమాగా రిలీజై అక్కడ సూపర్ సక్సెస్​ను అందుకుందీ మూవీ. మరి ఈ రీమేక్ ఇక్కడ ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో అంటోంది ఫిల్మ్ నగర్.