Breaking News

ప్లాంటేషన్ ను పర్యవేక్షించాలి

ప్లాంటేషన్ ను పర్యవేక్షించాలి

సారథి న్యూస్​, వాజేడు, వెంకటాపురం: ములుగు జిల్లా వాజేడు రేంజ్ పరిధిలోని పూసూర్ బీట్ లో 20 హెక్టార్ల ఎల్ఐఎం రైసింగ్ ప్లాంటేషన్ ను మంగళవారం సీసీఎఫ్ అక్బర్ సందర్శించారు. ప్లాంటేషన్ ను రోజు పర్యవేక్షణ చేసి సమయానికి నీళ్లు అందించాలని ఆదేశించారు. చెట్లకు చెదలు ఉన్న చోట నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే పనులపై తగిన సలహాలు సూచనలు చేశారు. అలాగే దులాపురం నర్సరీని తనిఖీచేశారు. వెంకటాపురం రేంజ్ పరిధిలోని అలుబకా గ్రామంలో నూతనంగా నిర్మించిన బీట్ ఆఫీసర్ క్వార్టర్స్ ను సీసీఎఫ్ అక్బర్ ప్రారంభించారు. ములుగు జిల్లా అటవీశాఖ అధికారి ప్రదీప్ కుమార్ శెట్టి, ములుగు ఎఫ్.డీ.వో నిఖిత, తాడ్వాయి ఎఫ్ డీవో శివ్ ఆశిష్ సింగ్, వెంకటాపురం ఎఫ్.డీ. వో గోపాల్ రావు, వెంకటాపురం ఇన్​చార్జ్​ ఎఫ్.ఆర్వో గౌతమ్ రెడ్డి, వాజేడు ఎఫ్ ఆర్ వో శ్రీనివాసన్ పాల్గొన్నారు.