Breaking News

ప్రజాసమస్యలు పరిష్కరించండి

ప్రజాసమస్యలు పరిష్కరించండి

సారథి న్యూస్​, పెద్దశంకరంపేట: ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది, ఐకేపీ ఏపీఎం, విద్యుత్ శాఖ సిబ్బంది పనితీరుపై మెదక్​ జిల్లా పెద్దశంకరంపేట ఎంపీపీ జంగం శ్రీనివాస్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు పనితీరు మార్చుకుని ప్రజాసమస్యలను పరిష్కరించేందుకు కృషిచేయాలని సూచించారు. శుక్రవారం రామాయంపేట పేట సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల మృతిచెందిన పెద్దశంకరంపేట 1వ ఎంపీటీసీ రాజమణి లక్ష్మీనారాయణ మృతికి నివాళులర్పించారు. బద్దారం, శివాయిపల్లి, చిల్లపల్లి, ఉత్తులూర్ గ్రామాల్లో కరెంట్ తీగలు కిందకు వేలాడుతున్నాయని ఆయా గ్రామాల సర్పంచ్​లు, ఎంపీటీసీలు సభ దృష్టికి తెచ్చారు. కరెంట్ తీగల సమస్యలను పరిష్కరించాలని ఎంపీపీ విద్యుత్ శాఖ సిబ్బందికి సూచించారు. బూరుగుపల్లి సర్పంచ్ సరిత మల్లేశం మాట్లాడుతూ తమ గ్రామంలోరోడ్డుకు పక్కన తమకు చెప్పకుండానే జెండాలు పెట్టారని, చేపల చెరువులో సైతం చేపపిల్లలు వదిలినప్పుడు తమకు సమాచారం ఇవ్వలేదన్నారు. సర్పంచ్​ పదవికి గౌరవం ఇవ్వడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మండల వైద్యాధికారి పుష్పలత మాట్లాడుతూ.. ప్రజలు కరుణ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పేట ఆస్పత్రికి పంపించాలని కోరారు. సమావేశంలో ఎంపీడీవో రామ్​నారాయణ, ఆయా గ్రామాల సర్పంచ్​లు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
నీవర్ తుఫాన్​ కారణంగా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విద్యుత్ శాఖ ఏఈ బసవేశ్వర రావు సూచించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వర్షాలు, ఈదురుగాలులు, నీళ్లు నిల్వ ఉన్నచోట కరెంట్ స్తంభాలను తాకకూడదని సూచించారు. రైతులంతా వారి విద్యుత్ మోటార్ల వద్ద జాగ్రత్తగా ఉండాలని కోరారు. గాలులు వీచే సమయంలో కరెంట్​ తీగల వద్ద కానీ కరెంట్​ స్తంభాల వద్ద కానీ ఉండకూడదన్నారు. విద్యుత్ స్తంభాలు విరిగి పడితే సంబంధిత లైన్ మెన్ కు లేదా సమీప సబ్ స్టేషన్ కు కు తెలియజేయాలని సూచించారు.