Breaking News

ప్రకృతిని రక్షించుకుందాం

అడవుల్లో కార్చిచ్చులు.. తుఫానులు.. భూకంపాలు .. కొద్ది రోజులుగా ప్రకృతి తన కోపానికి ప్రపంచం యావత్తునూ బలి తీసుకుంటూనే ఉంది. వీటితో పాటు భయంకరమైన వైరస్​లు మనుషుల ఆయుష్షును తగ్గించేస్తున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల నుంచి బయటపడేందుకు ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నా మీ వంతు బాధ్యత మీరు నిర్వర్తించండి అంటున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ‘మనమందరం నివశించే పర్యావరణాన్ని పరిరక్షించడం మనందరి వ్యక్తిగత బాధ్యత..’ అని దలైలామా కొటేషన్​ను ట్విట్టర్​లో షేర్ చేస్తూ.. ‘ప్రకృతి, మనం ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉన్నాం.. ప్రకృతిని రక్షించడం ద్వారా మనల్ని మనం రక్షించుకుంటున్నాం.

ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఈ సవాళ్ల మానవ జీవితపు దుర్భలత్వాన్ని ప్రకటిస్తున్నాయి. మనందరం సంతోషంగా జీవించాలంటే, ఆరోగ్యకరమైన, సమతుల్యమైన పర్యావరణాన్ని సృష్టించడం చాలా ముఖ్యం. మనం చేసే పనులు, మాట్లాడే విధానం మార్చుకోవడం ద్వారా మనమంతా ఇంట్లోనే ఉండి మన గొంతుకను ప్రపంచానికి వినిపించొచ్చు.. ప్రపంచ భవిష్యత్ మనందరిపై ఆధారపడి ఉంది. చెట్లను పెంచడం..నీటిని వాడకాన్ని తగ్గించడం.. విద్యుత్ ను ఆదా చేయడం.. పొల్యూషన్ కంట్రోల్ చేయడం.. జంతువులను రక్షించడం.. అడవులను సంరంక్షించండి.. ఇలా వీటిలో ఏదో ఒకటి మీకు నచ్చినదాన్ని ఎంచుకోండి.. దాన్ని రక్షించేందుకు ప్రయత్నించండి.. మీ వంతు బాధ్యతగా ఆ కార్యక్రమాన్ని ఈ రోజు నుంచే ప్రారంభించండి.. ” అంటూ వరల్డ్ ఎన్​రాన్​మెంట్​ డే సందర్భంగా సూపర్​స్టార్​ మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు. ప్రకృతి సంరక్షణలో ప్రజలంతా బాధ్యతను నిర్వర్తించాలని ఆయన సూచించారు.