Breaking News

పునరుత్తేజం కల్పిద్దాం

సారథి న్యూస్​, వనపర్తి: ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజీ కింద రైతులు, వలస కూలీలతో పాటు పారిశ్రామిక రంగానికి పునరుత్తేజం కల్పించేందుకు బ్యాంకర్లు నిర్దేశించిన గడువు కంటే ముందుగానే లోన్లు ఇవ్వాలని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా సూచించారు. శుక్రవారం ఆమె కలెక్టరేట్​లో ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజీపై బ్యాంకర్లు, సంబంధిత అధికారులతో సమీక్షించారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా ఔత్సాహిక ప్రోత్సాహం కింద చేయూత ఇవ్వాలని సూచించారు. బ్యాంకుల వారీగా ఉన్న ఎంఎస్ఎం ఈ ఖాతాదారులకు లోన్లు ఇచ్చే విషయాన్ని మెసేజ్​ ద్వారా తెలిపి నిర్ణీత గడువులోగా లోన్లు తీసుకోవాలని సూచించాలని ఆదేశించారు. ఎల్డీఎం సురేష్ కుమార్, జిల్లా పరిశ్రమల ఇన్​చార్జ్​ అధికారి హనుమంతు, డీఏవో సుధాకర్ రెడ్డి, పశు సంవర్థకశాఖ అధికారి వెంకటేశ్వర్​రెడ్డి, డీఆర్డీవో గణేష్, మున్సిపల్ కమిషనర్లు మహేశ్వర్​రెడ్డి, కృష్ణయ్య పాల్గొన్నారు.