Breaking News

పనిభారాన్ని అంచనా వేయడమే సక్సెస్​

న్యూఢిల్లీ: ఆటగాళ్లపై పడే పని భారాన్ని సరైన రీతిలో అంచనా వేయడమే.. టీమిండియా విజయానికి కారణమని బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ అన్నాడు. షమీ, బుమ్రా, ఇషాంత్.. 145 కి.మీ.స్పీడ్​తో బౌలింగ్ చేసినా.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకెళ్తున్నారని చెప్పాడు. ‘పనిభారం ప్రస్తావన రాగానే బౌలర్ ఎన్ని ఓవర్లు వేశాడనేది లెక్క వేస్తారు. కానీ ఇది కరెక్ట్ కాదు. అతను మైదానంలో ఎంతసేపు ఉన్నాడు. ఏం పనిచేశాడు. ఎంతసేపు పరుగెత్తాడు. ఇలా ప్రతి దానిని లెక్కగట్టాలి. అందుకే మేం జీపీఎస్ ట్రాకర్లను వాడి కరెక్ట్​గా లెక్కగడుతాం. ఫీల్డర్ 20 కి.మీ దూరం కవర్ చేస్తే అతను శ్రమ ఎంతో లెక్కగడతాం. దీనివల్ల మంచి ఫలితాలు వస్తాయి’ అని అరుణ్ పేర్కొన్నాడు.