Breaking News

నేను కూడా పెళ్లికి రెడీ

టాలీవుడ్​లోని కుర్ర హీరోలు, యంగ్ డైరెక్టర్ల ఒక్కొక్కరు పెళ్లి వైపు అడుగులు వేస్తున్నారు. మొన్న నిఖిల్ సిద్దార్థ ఇంట పెళ్లి బాజామోగింది. ఇక ఆ లైన్​లో రానా, నితిన్ ఉన్నారు. వారికి తోడు ఇప్పుడు ‘సాహో’ ఫేమ్ డైరెక్టర్ సుజిత్ కూడా పెళ్లికి సిద్ధమవుతున్నాడు.‘రన్ రాజా రన్’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సుజిత్ ప్రభాస్ తో రెండో మూవీ చాన్స్ కొట్టేసి ప్యాన్ ఇండియా డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఏకంగా మూడో సినిమాతో మెగాస్టార్ నే డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్న ఈ యంగ్ డైరెక్టర్ నిశ్చితార్థం ఈనెల 10న జరగబోతోంది.

ప్రవల్లిక అనే డెంటల్ డాక్టర్ తో ప్రేమలో ఉన్న సుజిత్ పెద్దల అంగీకారంతో ఒక్కటవబోతున్నారట. పెళ్లి తేదీ ఎప్పుడనేది త్వరలోనే ప్రకటించనున్నారు. మలయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసీఫర్’ తెలుగు రీమేక్ ను డైరెక్ట్ చేసే చాన్స్ అందుకున్న సుజిత్…తెలుగు నేటివిటీ, చిరంజీవి స్టార్ డమ్ ను దృష్టిలో పెట్టుకుని స్ర్కిప్ట్ ని సిద్ధం చేసే పనిలో ఉన్నాడట. సాహోను బాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కించిన సుజిత్ లూసీఫర్ రీమేక్ నూ అదే లెవల్ లో చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నాడట. సుజిత్ పెళ్లి తర్వాతే ఈ మూవీ సెట్స్ కి వెళ్లనుందట.