Breaking News

దళారులను నమ్మి మోసపోవద్దు

దళారులను నమ్మి మోసపోవద్దు

సారథి న్యూస్, నర్సాపూర్: ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం మించిన వినియోగించుకోవాలని, దళారులకు ధాన్యం అమ్మి మోసపోవద్దని మెదక్ కలెక్టర్ ధర్మారెడ్డి సూచించారు. శుక్రవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 200 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని అన్నారు. ఈసారి 1.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందన్నారు. రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. ఏఈవో ఆధ్వర్యంలో ధాన్యం క్వాలిటీ చెక్ చేసి కొంటామన్నారు. కూపన్ల రూపంలో ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. అన్ని కేంద్రాల్లో వసతులు, టార్పాలిన్ కవర్లను రైతులకు ఇచ్చామన్నారు. వర్షాలు పడే అవకాశం ఉన్నందున సొసైటీ చైర్మన్లు ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. అనంతరం కొనుగోలు కేంద్రం వద్ద ఆరబెట్టిన వరి ధాన్యాన్ని పరిశీలించారు.