Breaking News

తక్కువేమీ కాదు..

నటించినవి తక్కువ సినిమాలే అయినా బోల్డ్ యాక్టింగ్​తో అటు తమిళంలోనూ తెలుగులోనూ మంచి గుర్తింపు పొందింది అమలాపాల్. తెలుగులో రామచరణ్ ‘నాయక్’ , అల్లు అర్జున్ ‘ఇద్దరమ్మాయిలతో’ మంచి క్రేజ్ వచ్చినా గ్లామర్, యాక్షన్ కలగలిసిన ఈ సుందరికి టాలీవుడ్ కంటే కోలీవుడ్​లోనే ఎక్కువ అభిమానులు ఉన్నారు. అందుకే ఎక్కువగా తమిళ సినిమాల్లోనే కనిపిస్తుంటుంది. గతేడాది రిలీజైన ‘ఆమె’ సినిమా కలెక్షన్ల పరంగా విజయం సాధించలేకపోయినా అమలా బోల్డ్ యాక్టింగ్​కు అమ్మాయిలంతా ఫిదా అయిపోయారు.

కొద్దిరోజులు పెళ్లి అంటూ గ్యాప్ తీసుకున్నా తర్వాత ‘వీఐపీ2’తో సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడమే కాదు తాజా వెబ్ సిరీస్ వైపు కూడా అడుగులేస్తోంది. హిందీలో మహేష్ భట్ జియో స్టూడియోస్ తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్ లో అమలా నటిస్తోంది. అయితే రీసెంట్గా సోషల్ మీడియాలో ‘షి ఇండియా’ ఇంగ్లిష్ మ్యాగజైన్ కవర్ పేజీపై అమలా న్యూ లుక్ ప్రత్యక్షమైంది. బ్లాక్ కలర్ మోడ్రన్ డ్రెస్​లో అమలా గార్జియస్​​లా ఉన్న ఫొటో ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ కు సంబంధించింది. ఆ మ్యాగజైన్ ప్రారంభించి నేటితో ఏడాది పూర్తవడంతో అమలా ఈ కవర్ పేజీని తన ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్ చేసింది. క్షణాల్లో వైరల్ అవుతున్న ఈ ఫొటోను చూస్తుంటే అమలా పాల్​కు ఉన్న ఫాలోయింగ్ తక్కువేమీ కాదని అర్థమవుతోంది.