Breaking News

జాన్వీ కొంటె కోరిక


ప్రస్తుతం బాలీవుడ్​లో రైజింగ్ హీరోయిన్ల జాన్వీకపూర్ ఒకరు. అతిలోక సుందరి శ్రీదేవి తనయురాలు.. కపూర్ వంశపు రాజకుమారి. ‘ధడక్’ సినిమాతో అందరి హృదయాలను కొల్లగొట్టింది. ఇప్పుడు కరణ్ జోహార్, మనీష్ మల్హోత్రా వంటి దిగ్గజాల సపోర్ట్​తో తన కెరీర్​ను భాగానే ప్లాన్ చేసుకుంటోంది. ఈ లోపు కరోనా లాక్ డౌన్ కారణంగా అందరు సెలబ్రిటీలూ చేసేది లేక ఇంటికే పరిమితమయ్యారు. షూటింగ్​లు పూర్తయి రిలీజ్​కు దగ్గరలో ఉన్న సినిమాలను ఓటీటీ ప్లాట్​ఫామ్​లో విడుదల చేసేందుకు చాలామంది ఆసక్తి చూపడమే కాదు ఒకటి రెండు చిన్న సినిమాలు ఆల్​ రెడీ రిలీజ్​ చేశారు కూడా. అయితే ఈ క్వారెంటైన్ సమయాన్ని అంతా జాన్వీ ఎక్కువ తండ్రి బోనీ కపూర్​తో, సిస్టర్ ఖుషీ కపూర్​తోనే గడిపిందట. సోషల్ మీడియాకి టచ్​లో ఉంటూ తన ఫ్యామిలీ ఫొటోలను కూడా షేర్ చేస్తోంది. అలా తాజాగా జాన్వీ ఓ ఫొటోను షేర్ చేస్తూ దానికి ‘హియర్ లుకింగ్ ఎట్ యూ.. కిడ్’ అంటూ ఓ ఇంట్రెస్టింగ్ ట్యాగ్​ను జోడించింది. దానికి స్పందించిన ఫ్రెండ్ ‘కిడ్ ఎవరు? నీకు కిడ్ ను కనాలని ఉందా?’ అంటూ కవ్వించగా.. దానికి ‘ఎస్’ అంటూ అంతే వేడెక్కించే ఆన్సర్ ఇస్తూ బిగ్ పంచే వేసింది.