Breaking News

కోలీవుడ్ లో విలన్ గా కార్తీకేయ

కోలీవుడ్ లో విలన్ గా కార్తీకేయ

అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఎక్స్ 100’తో బ్లాక్ బ్లస్టర్ అందుకున్న కార్తికేయ ఆ తర్వాత హీరోగా సినిమాల్లో అంతగా సక్సెస్ అందుకోలేకపోయాడు. కానీ నాని హీరోగా నటించిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో విలన్ గా మెప్పించాడు కార్తికేయ. ఇంతలో కోలీవుడ్ లో తలా అజిత్ నటిస్తున్న సినిమాలో కూడా విలన్ రోల్ పోషిస్తున్నాడన్న టాక్ బలంగా కొద్ది రోజులుగా వినిపిస్తోంది. ఆ విషయం అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ రీసెంట్​గా కార్తీకేయ, అజయ్ భూపతి మధ్య జరిగిన వీడియో సంభాషణతో ఈ విషయం బయటపడింది. ‘నేర్కొండ పార్వై’ ఫేమ్ హెచ్.వినోద్ అజిత్ తో ‘వలిమై’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ కూడా నలభై శాతం పూర్తయ్యిందట. ఈ చిత్రంలో కార్తికేయ గుమ్మంకొండ విలన్ గా నటిస్తున్నాడు. ‘ఎవరికీ చెప్పొద్దు’ అంటూ కార్తికేయ.. ‘ఇప్పటికే అందరికీ తెలిసిపోయింది కార్తి..’ అంటూ అజయ్ భూపతి మాట్లాడుకున్న వీడియో వైరలైంది. దీంతో కార్తికేయకు అజిత్ ఫ్యాన్స్ కోలీవుడ్కి వెల్కమ్ చెబుతూ ట్వీట్లు చేస్తున్నారు.