Breaking News

కరోనా కట్టడికి చర్యలు

సింగరేణిలో కరోనా కట్టడికి చర్యలు

సారథి న్యూస్​, రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియా ఆస్పత్రిని బుధవారం సింగరేణి జీఎం నారాయణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. రామగుండం ఏరియా​-1 లోని కొందరు ఉద్యోగులకు కరోనా ప్రబలింది. వారంతా రామగుండం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సింగరేణిలోని ఉద్యోగులు, వారికుటుంబసభ్యులు విధిగా పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. రామగుండం ఏరియా ఆస్పత్రిలో ప్రతి రోజు 200 మందికి కరోనా టెస్టులు నిర్వహించి అదేరోజు ఫలితాలు వెల్లడిస్తారని చెప్పారు. వ్యాధితీవ్రత అధికంగా ఉన్నవారిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్​కు రిఫర్​ చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో సింగరేణి జీఎం నారాయణ, ఏసీఎంవో బీ వెంకటేశ్వర్ రావు, పర్సనల్ మేనేజర్ రమేశ్​, సెక్యూరిటీ ఫీసర్ వీరారెడ్డి, సంక్షేమ అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.