Breaking News

కరోనాయే చివరిది కాదు: డబ్ల్యూహెచ్ వో

కరోనాయే చివరిది కాదు: డబ్ల్యూహెచ్వో

జెనీవా: సుమారు పది నెలలుగా ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనాయే చివరి మహమ్మారి కాదని, భవిష్యత్తులో మరిన్ని రోగాలు వచ్చే అవకాశం లేకపోలేదని డబ్ల్యుహెచ్వో హెచ్చరించింది. ఈ మేరకు జెనీవాలో జరిగిన ఒక కార్యక్రమంలో డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రస్ అధనోమ్ మాట్లాడుతూ.. ‘ఇదే చివరి మహమ్మారి కాదు. వైరస్ వ్యాప్తిలు, మహమ్మారులు మన జీవితంలో భాగమని చరిత్ర చెబుతోంది. కానీ తరువాత రాబోయే మహమ్మారిని ఎదుర్కోవడానికి ఈ ప్రపంచం సర్వసన్నద్ధంగా ఉండాలి. ఇటీవల చాలా దేశాలు వైద్యం, ఆరోగ్యం కోసం ఎంతో కృషి చేస్తున్నాయి. కానీ కొన్ని దేశాలు ప్రజారోగ్య వ్యవస్థను తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తూ భారీ మూల్యాన్ని చెల్లించుకున్నాయి. ప్రజారోగ్య వ్యవస్థ బాగుంటేనే ఇలాంటి వైరస్ లు ఎన్ని వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కోగలం’ అని అన్నారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా 2.71 కోట్ల మందికి కరోనా సోకగా.. వీరిలో 8 లక్షలకు పైగా మంది చనిపోయారు.