Breaking News

ఎలా ఆడాలో నేర్చుకున్నా..

వయసు పెరుగుతున్నా వన్నె తరగలేదు టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్​కు. గ్లామర్, అభినయం రెండూ పెనవేసుకున్న నటిగా తెలుగు వారి గుండెల్లో తిష్ట వేసుకుని కూర్చున్న ఈ కుందనపు బొమ్మ ఇప్పుడు కొత్త పలుకులు పలుకుతోంది. ఎప్పుడూ షూటింగ్​ లో బిజీగా ఉండే తనకి ఈ లాక్​ డౌన్​ చాలా కొత్త సంగతులను నేర్పిందట. రెండు నెలలుగా ఇంట్లోనే ఉంటున్న కాజల్ ముందు ఫిట్​ నెస్​పై శ్రద్ధపెట్టింది. అది కాస్తా బోర్ కొట్టిందేమో ఇంటర్​నేషనల్​ గేమ్ చెస్ ఆడడం మొదలు పెట్టిందిట. ఆడటమే కాదు ఆ ఆటపై పట్టు సాధించాలని.. అన్ని వెబ్​ సైట్లను వెతికి చదరంగంలో మెళకువలన్నీ నేర్చుకుందట. ఆ తర్వాతేమో మనసును ఆధ్యాత్మికత వైపు మళ్లించిందట.

ఇక దూరదర్శన్​లో ప్రసారమవుతున్న భారత, రామాయణాన్ని చూడడమే కాదు భాగవతాన్ని కూడా ఫాలో అయిందట. భగవద్గీతలోని శ్లోకాలు కూడా కొన్ని నేర్చుకుందట.. ఇప్పుడు తన మనసు ప్రశాంతంగా ఉందట. ఇలా తన విలువైన టైమ్​ను గడిపిన కాజల్ లాక్ డౌన్ అనంతరం షూటింగ్​లకు హాజరుకానుంది. ప్రస్తుతం కాజల్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘భారతీయుడు 2’, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమాల్లో నటిస్తోంది.