Breaking News

ఉమెన్స్​ పర్సనల్​​ వెపన్స్​

ఉమెన్స్​ పర్సనల్​​ వెపన్స్​
  • మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన గ్యాడ్జెట్‌ ఇది

ఆపదలో మహిళలకు వెంటనే సహాయం అందకపోవచ్చు. అలాంటప్పుడు చుట్టూ ఎవరూ ఉండకపోవచ్చు. ఇలాంటి సమయంలో తోడుగా ఉన్న గ్యాడ్జెట్లే వారిని కాపాడుతాయి . మీకు సంబంధించిన అత్యవసర సందేశాన్ని ఆప్తులకు చేరవేస్తాయి. మీకు పర్సనల్‌వెపన్స్‌గా ఉపకరిస్తాయి. అలాంటి గ్యాడ్జెట్లు మహిళల కోసం..

పర్సనల్‌ అలారం

* మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన గ్యాడ్జెట్‌ఇది. పర్సనల్‌అలారం రెస్ట్‌లెట్‌గా పిలిచే ఈ గ్యాడ్జెట్‌ను హ్యాండ్‌ బ్యాగ్‌లో తీసుకెళ్లొచ్చు. ప్యాంట్‌ పాకెట్‌లోనూ పెట్టుకోవచ్చు. ఈ గ్యాడ్జెట్‌కున్న పిన్‌ను లాగేస్తే చాలు… అలారం యాక్టివేట్‌అవుతుంది. దీనికున్న లెడ్‌లైట్‌ను చీకట్లో  టార్చ్‌లా ఉపయోగించవచ్చు. ఈ గ్యాడ్జెట్‌ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది. 

స్మార్ట్‌లాకెట్‌

* మెడలో వేసుకుంటే సాధారణ లాకెట్‌మాదిరిగానే ఉంటుంది. కానీ మీరు ఆపదలో ఉన్నప్పుడు ఈ ‘సేఫర్‌’ లాకెట్‌పై డబుల్‌క్లిక్‌చేస్తే చాలు. ఆటోమెటిక్‌గా స్నేహితులు, కుటుంబసభ్యులకు అలర్ట్‌మెసేజ్‌వెళ్లిపోతుంది. జీపీఎస్‌ఫీచర్‌ ఉన్న ఈ లాకెట్‌ మీ లొకేషన్‌ను సైతం పంపిస్తుంది.

జస్ట్‌ప్రెస్‌

* ఈ గ్యాడ్జెట్‌ను చేతికి ధరించవచ్చు. చూస్తే సాధారణ గడియారంలా, గాజులా కనిపిస్తుంది. కానీ ఆపద కాలంలో దీనికి ఉన్న బటన్‌ను ప్రెస్‌చేస్తే అత్యవసర సందేశం వెళ్లిపోతుంది. సెల్‌ఫోన్‌తో ఇది సింక్రనైజ్‌అయి ఆడియో రికార్డింగ్‌చేస్తుంది. మహిళల చేతికి ఉండాల్సిన ‘సేఫ్‌లెట్‌’ గ్యాడ్జెట్‌ఇది.

సెల్ఫ్‌ డిఫెన్స్‌ కీ చైన్

* చూస్తే కీ చైన్​ మాదిరిగానే ఉంటుంది కానీ అత్యవసర సమయాల్లో ఆత్మరక్షణ కోసం పర్సనల్‌వెపన్‌గా వెన్నంటి ఉంటుంది. ఇది ఎంత స్ట్రాంగ్‌గా ఉంటుందంటే కిటికీ అద్దాన్ని సైతం దీంతో బద్దలు కొట్టవచ్చు. మీపై దాడికి ప్రయత్నించిన వారిని ఈ కీ చెయిన్‌తో గాయపరిచి సురక్షితంగా బయటపడొచ్చు. 

పెన్నే కానీ..

* మామూలు పెన్నులా రాసుకోవచ్చు. అపద సమయంలో ఆయుధంగా వాడుకోవచ్చు. ఇదీ ‘అటామిక్‌బేర్‌టాక్టికల్‌పెన్‌’ ప్రత్యేకత. మిలిటరీ గ్రేడ్‌అల్యూమినియంతో తయారైన ఈ పెన్నుతో కారు అద్దాలను సైతం సులభంగా పగలగొట్టవచ్చు. భద్రత విషయంలో ఆందోళన చెందే మహిళలు ఈ పెన్నును తమవద్ద ఉంచుకోవాల్సిందే. ఆన్‌లైన్‌స్టోర్స్‌లో అందుబాటులో ఉంది.