Breaking News

రిథమిక్​ ట్రైనింగ్​

సారథి న్యూస్​, హైదరాబాద్​: పోలీసులకు ట్రైనింగ్‌లో శిక్షణ ఎంత కఠినంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే శరీరానికి అలుపు రాకుండా శిక్షణ ఇస్తున్నారు ఓ పోలీస్​ ఆఫీసర్​. పాటకు లయబద్ధంగా చేయిస్తున్న కసరత్తు ఆకట్టుకుంటోంది. తెలంగాణ స్టేట్‌ స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌లో ట్రైనీ పోలీసులకు శిక్షణ ఇస్తున్న అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పాటతో రిథమిక్​గా శిక్షణ ఇస్తున్నారు. ట్రైనీ పోలీసులకు శిక్షణ కఠినంగా అనిపించకుండా ఉండేందుకు పాటలు పాడుతూ శిక్షణ ఇస్తుంటారు. 1970లో వచ్చిన హమ్‌జోలీ సినిమా నుంచి రఫీ పాడిన ‘దల్‌ గయా దిన్‌.. హో గయి శామ్‌’ పాటకు ట్రైనింగ్​ ఇస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్​ అవుతోంది.