Breaking News

కార్మిక హక్కులను కాలరాస్తున్న పాలకవర్గాలు

కార్మిక హక్కులను కాలరాస్తున్న పాలకవర్గాలు

సారథి, సిద్దిపేట ప్రతినిధి, హుస్నాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను కాలరాస్తున్నాయని ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అందె అశోక్ అన్నారు. ఈ సందర్భంగా చేర్యాల పట్టణంలో 135వ మేడే ఉత్సవాలకు హాజరై మాట్లాడారు. 1886 చికాగో నగరంలో కార్మికులు 8గంటల పనిదినాలు కల్పించాలని మోరుపు సమ్మె చేస్తుంటే పోలీసులు కార్మికులపై తూపాకి గండ్ల వర్షం కురిపంచారన్నారు. దీంతో అనేక మంది కార్మికులు అమరత్వం పొందారన్నారు. కార్మికులు రాజ్యాంగ బద్దంగా కొట్లాడాడి తెచ్చుకున్న 44 కార్మిక చట్టాలను సవరణల పేరుతో నాలుగు కోడ్ లుగా విభజించడం పట్ల మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై కార్మికులు మరో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లారెడ్డి, సీపీఐ పట్టణ కార్యదర్శి అంజయ్య గౌడ్, ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు భానుప్రసాద్, ప్రేమ్ కుమార్, సురేందర్, బాలరాజు, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.