Breaking News

ఎండిన నదులను కాళేశ్వరం జలాలతో జీవం

ఎండిన నదులను కాళేశ్వరం జలాలతో జీవం

సారథి, చిన్నశంకరంపేట: గోదావరి జలాలతో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొండపోచమ్మ, హల్ది, పసుపులేరు, ఘనపూర్ ఆనకట్ట నుంచి నిజాంసాగర్ కు నీరు అందించి ఎండిపోయిన నదులను జీవనదులుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి అన్నారు. శనివారం మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని దర్పల్లి చెక్ డ్యాంలోకి చేరిన నీళ్లకు హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతుల కష్టాలను గుర్తించి సీఎం కేసీఆర్ కంకణబద్ధులై అహర్నిశలు కష్టపడి, గోదావరి జలాలు రైతుల పాదాలను తాకే విధంగా కృషిచేశారని కొనియాడారు. కేవలం ధరిపల్లి గ్రామంలోనే 400 ఎకరాలకు నీరు అందించవచ్చన్నారు. దరిపల్లి, సూరారం, మీర్జాపల్లి గ్రామాల్లో సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం వార్షికోత్సవంలో భాగంగా మీర్జాపల్లి పెద్దమ్మతల్లి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మాధవి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పట్లూరి రాజు, ఎంపీడీవో గణేష్ రెడ్డి, ఏఈవో శ్రీనివాస్, ఆర్ఎస్ శ్రీహరి, బండారు స్వామి, బందెల ప్రభాకర్, పడాల శ్రీనివాస్, ఏమ చంద్రం, ఆకుల దుర్గయ్య, నరేష్ తదితరులు పాల్గొన్నారు.