Breaking News

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ట్రైలర్‌ వాయిదా..

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ట్రైలర్‌ వాయిదా..

దర్శకధీరుడు రాజమౌళి, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, యంగ్‌ టైగర్‌ జూనియర్​ఎన్టీఆర్‌ కాంబినేషనల్‌లో తెరకెక్కిన బిగ్గెస్ట్‌ మల్టీస్టారర్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఈ సినిమా థియేటరికల్‌ ట్రైలర్‌ను వాయిదా వేస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. అయితే డిసెంబర్‌ 3న ట్రైలర్‌ రిలీజ్​చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించినా ప్రముఖ సినీరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అకాల మరణంతో పాటు పలు అనివార్య కారణాలతో వాయిదా వేస్తున్నట్లు బుధవారం ఉదయం చిత్రబృందం తెలిపింది. త్వరలోనే ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ను ప్రకటిస్తామని వెల్లడించింది. అల్లూరి సీతారామరాజుగా రామ్‌ చరణ్‌, కుమ్రంభీమ్‌గా తారక్‌ కనిపించనున్న ఈ సినిమాను సుమారు రూ.450 కోట్ల భారీ బ్జడెట్‌తో నిర్మించారు. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్‌ బ్యూటీ ఆలియాభట్‌ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుంది. ఇందులో ఆమెకు రామ్‌ చరణ్‌ జోడిగా నటించనున్నారు. ఎన్టీఆర్‌కు జంటగా హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరీస్‌ అలరించనుంది. కీరవాణి స్వరాలు అందిస్తున్న ఈ సినిమా భారీ అంచనాలతో జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.