Breaking News

సున్నం రాజయ్యతో విడదీయలేని అనుబంధం

సున్నం రాజయ్యతో విడదీయలేని అనుబంధం

సారథి, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో మంగళవారం సీపీఎం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మొదటి వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు దబ్బకట్ల లక్ష్మయ్య, రాజయ్య మాట్లాడుతూ.. రాజయ్యకు వాజేడు మండల ప్రజలతో విడదీయలేని అనుబంధం ఉందని గుర్తుచేశారు. మండల ప్రజలను రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరినీ పేరుపేరునా పలకరించే వారని అన్నారు. మండలంలోని గ్రామాల అభివృద్ధికి తను శాసనసభ నిధులను వెచ్చించి పనిచేసేవారని అన్నారు, వ్యవసాయ కార్మిక, రైతాంగ, పోరాటాల్లో అగ్రభాగాన ఉండి ప్రజల పక్షాన నిలబడి మాట్లాడేవారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి కొప్పుల రఘుపతి, నాయకులు, గుగ్గిళ్ల దేవయ్య, బచ్చల స్వరూప, బద్ది కిరణ్, యాలం శాంతకుమారి, దబ్బకట్ల శకుంతల, బచ్చల సౌమ్య, యాలం పాపారావు, మద్ద నరసమ్మ, మాడుగుల నరసింహారావు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.