Breaking News

ముంబైలో నాకా వర్కర్ల మే డే వేడుకలు

ముంబైలో నాకా వర్కర్ల మే డే వేడుకలు

సారథి, వేములవాడ: నాకా వర్కర్ల ఆధ్వర్యంలో శనివారం ముంబైలోని పశ్చిమ విలేపార్లే నాకా వద్ద మే డే, మహారాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విలేపార్లే నాకా వర్కర్ల సంఘం అధ్యక్షుడు చవల్ రమేష్ మాల మాట్లాడుతూ.. దేశంలో కార్మికులకు, మహిళలకు, ఉద్యోగులకు సమాన వేతనాలు, 14 గంటల నుంచి 8 గంటల వరకు కుదింపు, కార్మిక సంఘాలకు గుర్తింపు తదితర రాజ్యాంగ పరమైన హక్కులను భారతరత్న డాక్టర్​ బీఆర్ ​అంబేద్కర్ ​కల్పించారని కొనియాడారు.

అంబేద్కర్ రూపొందించిన కనీస వేతనాల చట్టం ఇంతవరకు యజమానులు సక్రమంగా అమలుచేయడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆయన రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్​3 ప్రకారమే సాధించుకున్నామని గుర్తుచేశారు కార్మికులకు 150 మాస్కులు, 150 సానిటైజర్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కార్మికసంఘం నాయకులు నారాయణ మాల, యముల రామరావు మహరాజ్, రమేష్ మహారాజ్, మంతెన అశోక్, రాంజీ నవగడే, కొమ్ము భాస్కర్, రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.