Breaking News

గౌరవెల్లి నిర్వాసిత రైతులపై దాష్టీకం

గౌరవెల్లి నిర్వాసిత రైతులపై దాష్టీకం
  • భూనిర్వాసితులపై పోలీసుల లాఠీచార్జ్​
  • భయబ్రాంతులకు గురైన రైతులు
  • ఖండించిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్​
పోలీసుల దాడిలో చిరిగిపోయిన రైతు బట్టలు

సామాజికసారథి, సిద్ధిపేట: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రాజెక్టులో భూములు కోల్పోయి పూర్తి పరిహారం అందక నిరసనలు చేపడుతున్న భూనిర్వాసితులపై పోలీసులు లాఠీచార్జ్​చేశారు. తెల్లవారుజామున 3:30 గంటలకు ప్రత్యేక పోలీసు బలగాలు వచ్చి నిర్వాహిత రైతులపై కర్కశంగా దాడిచేశాయి. నిర్వాసితులను ఏ పోలీస్​స్టేషన్​కు తరలిస్తున్నారో తెలియకుండా భయబ్రాంతులకు గురయ్యారు.
గౌరవెల్లి ప్రాజెక్టు భూనిర్వాసితులపై దాడి చేయడం ప్రభుత్వానికి సిగ్గుచేటని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మాట్లాడుతూ.. నిర్వాసితులపై పోలీసులు దాడిచేయడం హేయమైన చర్య అన్నారు. నిర్వాసితులపై ప్రభుత్వం సానుకులంగా స్పందించి న్యాయం చేయాల్సింది పోయి తిరుగుబాటు చేయడం సిగ్గుచేటన్నారు. ట్రయల్ రన్ ప్రక్రియ ఆపాలని కోర్టు నిర్ణయించి.. స్టే ఇచ్చిన ప్రభుత్వం ఒంటెద్దు పోకడతో నిర్వాసితులను బలవంతంగా ఖాళీ చేయించాలని చూస్తుందన్నారు. బాధిత రైతులకు దాడిచేసిన పోలీస్ అధికారులను సస్పెండ్ చేసి, నిర్వాసితుల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్​చేశారు. నిర్వాసిత రైతులకు న్యాయం చేయాలని, న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని, స్థానికుల అరెస్ట్​లను ఖండిస్తున్నామని కాంగ్రెస్​హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్​చార్జ్​
బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి అన్నారు.