Breaking News

పండుగలా హరితహారం

పండుగలా హరితహారం

సారథి, మానవపాడు: రాష్ట్రప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ఏడేళ్లుగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని, అలాంటి ప్రోగ్రామ్​ ను పండుగలా చేసుకోవాలని జోగుళాంబ గద్వాల జిల్లా జడ్పీ చైర్​పర్సన్​ సరిత తిరుపతయ్య కోరారు. గురువారం బోరవెల్లి స్టేజీ నుంచి పల్లెపాడు గ్రామం వరకు 8కి.మీ.రహదారిపై పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే అబ్రహంతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుత తరుణంలో ఆక్సిజన్ లేక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని గుర్తుచేశారు. స్వచ్ఛమైన ఆక్సిజన్ ప్రతిఒక్కరికీ అందాలంటే చెట్లను తప్పనిసరిగా పెంచాలని సూచించారు. మొక్కలను నాటడమే కాదు సంరక్షించాలని కోరారు.

అనంతరం ఎమ్మెల్యే అబ్రహం మాట్లాడుతూ.. 230 కోట్ల మొక్కలను నాటి వాటిని భావితరాలకు అందించాలని సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని వివరించారు. ప్రతి గ్రామంలోని ఖాళీస్థలంలో మొక్కలను పెంచి కాపాడాలన్నారు. కార్యక్రమంలో కోట్ల అశోక్ రెడ్డి, సర్పంచ్​లు విజయ, నారాయణ, ఆత్మలింగారెడ్డి, ఎంపీటీసీ మస్తాన్, బోరవెల్లి సత్యరెడ్డి, శేషిరెడ్డి, సీతారాముడు, మహ్మద్​తదితరులు పాల్గొన్నారు.