Breaking News

కరోనా విషయంలో నిర్లక్ష్యం వద్దు

కరోనా విషయంలో నిర్లక్ష్యం వద్దు
  • జిల్లా కలెక్టర్ హనుమంతరావు

సామాజిక సారథి, సంగారెడ్డి:  జిల్లాలో అర్హులందరూ జాప్యం చేయకుండా  వ్యాక్సిన్ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సూచించారు. దేశ వ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతున్నందున జిల్లా ప్రజలు  అప్రమత్తంగా ఉండాలన్నారు. వ్యాక్సిన్ తీసుకోవడంలో నిర్లక్ష్యం చేయరాదన్నారు. టీకా పొందినవారికి ప్రమాదం లేదని,  రెండు డోసులు టీకా పొందినవారు సురక్షితమన్నారు. కోవిడ్ నిబంధనల మేరకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ సూచించారు. ఎప్పటికప్పుడు చేతుల్ని శుభ్రం చేసుకోవాలన్నారు. కోవిడ్ ఆంక్షలు పాటించకుండా తిరిగితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మాస్క్ ధరించకుంటే  వెయ్యి రూపాయల జరిమాన విధించడం జరుగుతుందన్నారు. కోవిడ్ అనుమానంతో సొంత వైద్యం చేసుకోవద్దని,  ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని,  వైద్యుల సలహా మేరకే మందులు వాడాలన్నారు. జిల్లాలో  రెండవ డోసు తీసుకోవడానికి ఇంకా 80 వేల మంది అర్హులు ఉన్నారన్నారు. వారంతా ఒకటవ డోసు తీసుకుని 84 రోజులు పూర్తయినా రెండో డోస్ తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. అర్హులైన అందరూ వెంటనే రెండవ డోసు తీసుకోవాలని కలెక్టర్ హనుమంత రావు కోరారు.