Breaking News

అధైర్యపడొద్దు..అండగా ఉంటా

బ

– మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్

సామాజిక సారథి, ఇల్లంతకుంట: వలస కార్మికుల కుటుంబాలు అధైర్యపడొద్దు అండగా ఉంటామని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం బాధిత కుటుంబాలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలలో కలిసి మాట్లాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం దాచారం గ్రామానికి చెందిన 1) శ్రీరాముల రవిందర్ వృత్తిరీత్యా వడ్రంగి పని చేస్తూ కుటుంబాన్ని పొషించేవాడన్నారు. దినదినం కుటుంబ పోషన భారం కావడంతో ఆలీపిల్లలనొదిలి బతుకుదెరువు కోసం దుబాయ్ ప్రాంతానికి వలబోయిండని భార్య రమ, కూతుళ్లు దీపిక(13), సుభిక్ష(11), కన్నీటిపర్యంతమయ్యారు. అదే గ్రామంలోని దళిత నిరుపేద కుటుంబానికి చెందిన కంచె రవీందర్ సైతం తల్లిదండ్రులను, భార్య దేవంద్ర, సౌమ్య (19), సౌష్ణవి(1), కొడుకు నయన్ (13) కుటుంబాన్ని వొదిలి తాళిబొట్టును అరబ్ షేక్ ల దగ్గర తాకట్టుపెట్టి బతుకు దినదినగండంగా గడుపుతున్నారని కుటుంబసభ్యులు వాపోయారు.

ఇండియాకు రప్పిస్తా..

నిరుపేద కుటుంబాలకు చెందిన అభాగ్యులు పొట్ట చేతపట్టుకొని బతుకుదెరువు కోసం దుబాయి పోయిండ్రన్నారు. కొంతమంది ఎజెంట్ల చేతిలో మోసపోయి అనేకమంది వలస కూలీలు జైలు జీవితం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దుబాయి అడ్వకేట్ అనురాధ, ఎంబాసి అధికారులతో ఫోన్ లో మాట్లాడి వలసకూలీలను ఇండియాకు అత్యంత త్వరగా రప్పించాలని కొరారు. వలస కూలీల కోసం నావంతు సహాయం చేయడంతో పాటు మంత్రి కేటీఆర్, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లుతానని బాధిత కుటుంబాలకు హామీ ఇచ్చారు.