![ఆపత్కాలబంధు సీఎం సహాయనిధి](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/11/24HSB10.jpg?fit=1103%2C520&ssl=1)
సామాజిక సారథి, హాలియా: సీఎం సహాయనిధి ఆపత్కాలబంధు అని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. హాలియాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిడమానూరు మండలానికి చెందిన పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపద సమయంలో వైద్య ఖర్చులకు, పేద ప్రజల ఆరోగ్యం కోసం సీఎం సహాయనిధి బాధిత కుటుంబాలకు ఆసరాగా ఆదుకుంటుందని చెప్పారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తాటి సత్యపాల్, మార్కెట్ చైర్మన్ కామెర్ల జానయ్య, సర్పంచ్ అల్లం శ్రీను, సూరేపల్లి సర్పంచ్, శివాలయం చైర్మన్ లింగప్ప, ఎంపీటీసీ నాగేంద్ర, నారాయణ తదితరులున్నారు.