Breaking News

బ్లాక్ మెయిల్ కానిస్టేబుల్ పై వేటు

బ్లాక్ మెయిల్ కానిస్టేబుల్ పై వేటు
  • మామూళ్లు వసూలు చేసినట్లు నిర్ధారణ
  • మరో కానిస్టేబుల్ పై సస్పెన్షన్ ఎత్తివేత
  • వివరాలు వెల్లడించిన ఎస్ఐ గోవర్ధన్
  • ‘సామాజికసారథి’ సంచలన కథనం
    సామాజికసారథి, నాగర్ కర్నూల్: నిరంతరం గస్తీ కాసే పెట్రోలింగ్ సమయంలో ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్న ఓ కానిస్టేబుల్ ను సస్పెండ్ చేస్తూ నాగర్ కర్నూల్ ఎస్ఐ గోవర్ధన్ ఉత్తర్వులు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే..నాగర్ కర్నూల్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడవత్ రాము నాయక్ కానిస్టేబుల్ బ్లూకోట్స్, పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్నాడు . పలు చోట్ల ఫోటోలు తీసి బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడ్డారు. తాను తీసిన ఫోటోలు డిలీట్ చెయ్యాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో శ్రీనునాయక్ అనే వ్యక్తి ఫోన్ నెంబర్ ఇచ్చి అతనికి డబ్బులు పంపించాలని బెదిరించారట. ఈ క్రమంలో పలువురు నుంచి డబ్బులు వసూలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై సమగ్ర వివరాలతో ‘సామాజిక సారథి’లో గత నెల 27న ‘వారెవ్వా.. పోలీస్’ శీర్షికన వార్త ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ విషయమై విచారణ జరిపిన పోలీసు శాఖ ఉన్నతాధికారులు రామునాయక్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉదంతంలో చిన్న అనే కానిస్టేబుల్ పై సస్పెన్షన్ వేటు వేశారు. చివరికి విచారణలో ఎలాంటి తప్పు చేయలేదని తేల్చి సస్పెన్షన్ ఉత్తర్వులను ఎత్తివేసినట్లు ఎస్ఐ గోవర్ధన్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *