Breaking News

భక్తిశ్రద్ధలతో బక్రీద్ వేడుకలు

భక్తిశ్రద్ధలతో బక్రీద్ వేడుకలు

సారథి, వేములవాడ: త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగను ముస్లింలు బుధవారం వేములవాడ పట్టణంతో పాటు మండల కేంద్రాలు, గ్రామాల్లో భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. కరోనా నుంచి సమస్త భూప్రపంచాన్ని కాపాడాలని అల్లాహ్​ను ప్రత్యేక ప్రార్థనలతో వేడుకున్నారు. వేములవాడ పట్టణంలోని జామే, మహ్మదీయ, ఆర్ఫా, మెయిన్, మదీనా మసీదుల్లో ప్రత్యేక నమాజు చేశారు. వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని నాంపల్లి ఇస్లాంనగర్, రుద్రవరం, శాత్రాజపల్లి, ఫజల్ నగర్ జామే మసీద్ లో మత గురువు బక్రీద్ పండుగ విశిష్టత, చారిత్రక నేపథ్యాన్ని వివరించారు. తండ్రి, కొడుకుల త్యాగానికి ప్రతీకగా బక్రీద్ పండుగ ఆచరణలోకి వచ్చిందన్నారు. జిల్లాలోని కోనరావుపేట, బోయినపల్లి, ఇల్లంతకుంట, ముస్తాబాద్, గంబీరావుపేట, రుద్రంగి మండల కేంద్రాలతో పాటు పలు గ్రామాల్లో ఈ పర్వదినాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. కార్యక్రమంలో వేములవాడ మున్సిపల్ కౌన్సిలర్ సలీం, కోఆప్షన్ సభ్యుడు సర్వర్ అలీ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పీర్ మహమ్మద్, జర్నలిస్టులు ఎంఏ మన్నాన్, సయ్యద్ తాహెర్ పాషా, చందుర్తి అజీం, లాయక్ పాషా, ఆర్కే యూసుఫ్, కలీమ్, రఫిక్, హబీబ్ పాషా, హైమహ్మద్ పాషా, వేములవాడ మసీద్ కమిటీ అధ్యక్షుడు షేక్ ఇమామ్ సర్వర్, సర్వర్ అలీ, రఫిక్, ముస్లిం యూత్ నాయకులు షేక్ రియాజ్, అక్రమ్, ఇంతియాజ్ అంజద్ పాషా, రాహుల్, ఇబ్రహీం, ఎండీ జమీల్, రజాక్, అజీజ్ పాల్గొన్నారు.