Breaking News

అన్నదానం గొప్పకార్యం

అన్నదానం గొప్పకార్యం

సారథి, వేములవాడ: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల లాక్ డౌన్ విధించడంతో వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంతో పాటు నిత్యన్నదాన కార్యక్రమాలు నిలిచిపోయాయి. నిత్యన్నదానం పై ఆధారపడి కడుపు నింపుకునే పేదలు, యాచకులు ఆకలితో విలవిల్లాడుతున్న నేపథ్యంలో శనివారం 250 మందికి జిల్లా ఎస్పీ రాహుల్ హేగ్డే పండ్లు, పౌష్టికాహారం ఆహారం అందజేసి వారిని అభినందించారు. తిండి లేక ఇబ్బంది పడుతున్న వారికి ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. లాక్ డౌన్ సమయంలో ప్రజలు ఎవరూ బయటకు రావద్దని హెచ్చరించారు. నిబంధనలు పాటించి ప్రతిఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో వేములవాడ డీఎస్పీ చంద్రకాంత్, సీఐ వెంకటేష్, యువ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.