Breaking News

‘సర్కారు వారి పాట’ మాస్ లుక్

ఏటా సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ తన కొత్త సినిమాకు సంబంధించిన కీలక అప్​డేట్​ విడుదల చేస్తుంటారు. ఈసారి తన కొత్త సినిమా ‘సర్కారు వారి పాట’ను అనౌన్స్ చేశాడు. మహేష్ లాంగ్ హెయిర్, లైట్ బియర్డ్ తో స్టైలిష్ గా మెడ మీద వన్ రూపీ కాయిన్ టాటూతో ఇయర్ రింగ్ పెట్టుకుని ఇంతకు ముందుచూడని మాస్ లుక్ తో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకుంటున్నాడు.
మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్​టైన్​మెంట్​,14 రీల్స్ ప్లస్ సంస్థలు పరశురామ్ దర్శకత్వంలో ఈ ప్రెస్టీజియస్ మూవీని నిర్మిస్తున్నాయి.

‘సర్కారు వారి పాట’ను అనౌన్స్​ చేస్తూ సూపర్ స్టార్ మహేష్ బాబు, ‘మరో హ్యాట్రిక్ కు ఇది బ్లాక్ బస్టర్ స్టార్ట్’ అని అన్నారు. ‘సూపర్ స్టార్ మహేష్ గారిని డైరెక్ట్ చేయాలనే నా కల నెరవేరింది. దీని కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది, ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకి వెళ్దామా అని ఉంది..’ అని దర్శకుడు పరశురామ్ అన్నారు.
‘సూపర్ స్టార్ మహేష్ గారంటే నాకెంతో ఇష్టం. ఆయనతో ఏడళ్ల తర్వాత కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా మ్యూజికల్ గా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.’ అని మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అన్నారు. సూపర్​ స్టార్​ మహేష్​బాబు ‘సర్కారు వారి పాట’ను అనౌన్స్​ చేయడం ఆనందంగా ఉందని నిర్మాతలు చెప్పారు.