Breaking News

మెదక్​కు నెలరోజుల్లో కాళేశ్వరం నీళ్లు

సారథి న్యూస్, మెదక్: సీఎం కేసీఆర్​ రైతులకు ఆపద్భాండవుడని, రైతుబిడ్డగా రైతులు పడే కష్టాలన్ని విషయాలు ఆయనకు తెలుసునని మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్​ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం మెదక్​ కలెక్టరేట్​ ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వం రూ.12వేల కోట్ల రుణమాఫీ చేసి 53 వేలమంది రైతులకు ఎంతో మేలు చేసిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఏదో మాట్లాడారు… కొండపోచమ్మ సాగర్ ను చూసి ఇష్టారీతిన మాట్లాడిన వారు ఇప్పుడు నివ్వెరపోతున్నారని అన్నారు. మెదక్​ నియోజకవర్గానికి నెలరోజుల్లో గోదావరి నీళ్లు రానున్నాయని వివరించారు. సీఎం కేసీఆర్​ రైతుల పక్షపాతి అని వారు లక్షాధికారులు కావాలని… గొప్పవారు కావాలని కోరుకుంటారన్నారు.

సీఎం చెప్పినట్లు ఫాలో అయితే ప్రతి రైతు గొప్పవారవుతారని అన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ శేరి సుభాష్​రెడ్డి, జడ్పీ చైర్​పర్సన్​ హేమలత, మెదక్​ ఎమ్మెల్యే పద్మాదేవేందర్​రెడ్డి, మెదక్​ జిల్లా కలెక్టర్​ ధర్మారెడ్డి, ఎస్పీ చందనాదీప్తి, అడిషనల్​ కలెక్టర్​ నగేష్​, జడ్పీ వైస్​ చైర్​పర్సన్​ లావణ్యరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్​ చంద్రాగౌడ్​, జడ్పీ సీఈవో లక్ష్మీబాయి, ఇఫ్కో డైరెక్టర్​ దేవేందర్​రెడ్డి, మెదక్​ మున్సిపల్​ చైర్మన్​ చంద్రపాల్​, వైస్​ చైర్మన్​ మల్లికార్జున్​గౌడ్​, జిల్లా అధికారులు హనోక్​, శ్రీనివాసులు, రమ్య, పద్మాజరాణి, భార్గవి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.