Breaking News

మాస్క్​ కట్టుకోవాల్సిందే..

మాస్క్​ కట్టుకోవాల్సిందే..

సారథి న్యూస్​, వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలు కరోనా వ్యాప్తి నేపథ్యంలో తప్పనిసరిగా మాస్క్​ కట్టుకోవాల్సిందేనని వరంగల్ పోలీస్ కమిషనర్ పి.ప్రమోద్ కుమార్​ సూచించారు. రోజు రోజుకు విస్తరిస్తున్న వ్యాధిని నియంత్రించడం కోసం ప్రతి పౌరుడు తమ వంతు బాధ్యతగా ప్రభుత్వ ఇచ్చిన అదేశాలను గౌరవిస్తూ ప్రజలు తమ వ్యక్తిగత ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడంతో పాటు సమాజ పరిరక్షణకు కృషిచేయాలన్నారు. కోవిడ్​ నిబంధనలు ఉల్లంఘించి తిరిగితే డిజాస్టర్ మెనేజ్ మెంట్ యాక్ట్ 51(బి) మేరకు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.