Breaking News

మణుగూరులో మావోయిస్టుల కలకలం

సారథిన్యూస్​, కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్రంలోకి మావోయిస్టులు ఎంటరయ్యారా? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగురు అటవీప్రాంతంలో మూడు మావోయిస్టు బృందాలు తిరుగుతున్నాయా? అంటే అవుననే సమాధానం వినవస్తుంది. మణుగురు అటవీప్రాంతంలో మావోయిస్టులు తిరుగుతున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో మణుగురు అటవీ ప్రాంతాన్ని 20 ప్రత్యేకబృందాలు జల్లెడ పడుతున్నాయి. ఈ ప్రాంతంలోని వ్యక్తులపై ఏ మాత్రం అనుమానం వచ్చినా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. సుమారు 400 మంది పోలీసులు మావోయిస్టుల కదలికలపై ముమ్మరంగా గాలిస్తున్నారు.